CRDA కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే తాతయ్య
NTR: ఏపీ CRDA కమిషనర్ విజయ రామరాజును జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాజగోపాల్ (తాతయ్య) మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా CRDA పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జగ్గయ్యపేట పరిధిలోని బలుసుపాడు రోడ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, కమిషనర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.