"రానున్న MPTC ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి"
MLG: మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో గోవిందరావుపేట మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో 15ను కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా ఇవాళ మండలంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ పాల్గొని, పార్టీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న MPTC ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.