VIDEO: వరంగల్‌లో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

VIDEO: వరంగల్‌లో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

WGL: వరంగల్ జిల్లాలో నేటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 47 కేంద్రాల్లో 9,492 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు 30 నిమిషాల ముందే రావాలని, ఉదయం 9:35 తర్వాత కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అధికారులు సూచించారు.