గుడ్లవల్లేరులో మినుము కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం
కృష్ణా: గుడ్లవల్లేరు మార్కెట్ యార్డులో ప్రస్తుత రబీ సీజన్లో రైతుల సాగు చేసిన మినుము పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పొట్లూరి రవి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మినుము క్వింటాకు రూ.7,800, పెసలు రూ.8,768 ధరను ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.