పోస్టల్ సేవలపై డాక్ అదాలత్

VZM: పోస్టల్ సేవలపై ప్రజల నుండి వినతులను స్వీకరించడానికి డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయపు సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను కవర్ పై డాక్ అదాలత్ అని రాసి అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, విజయవాడ వారికీ పోస్ట్ ద్వారా మే 1వ తేదీ లోపల చేరేలా పంపాలన్నారు.