ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్యాధికారి

SRCL: గంభీరావుపేట మండలంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. టీకాలు, రికార్డులు పరిశీలించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాల గురించి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.