ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి - కలెక్టర్
WGL: జిల్లాలోని చారిత్రక ఆలయాలు, వారసత్వ సంపద అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. వరంగల్ కోటలో ఏర్పాటు చేయనున్న నూతన పురావస్తు మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. వారసత్వ పరిరక్షణతో పాటు వరంగల్‌ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.