ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
విజయనగరంలో ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేయాలని అధికారులను ఆదేశించారు.