బాలికతో బలవంతపు వివాహం.. నలుగురికి జైలు శిక్ష
NTR: విజయవాడలో 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న కేసులో పోక్సో కోర్టు నిన్న కఠిన తీర్పు ప్రకటించింది. ప్రధాన నిందితుడు పవన్‌కు 3 ఏళ్ల జైలు, రూ. 25 వేల జరిమానా విధించగా, అతనికి సహకరించిన ముగ్గురికి ఒక్కో ఏడాది జైలు, రూ. 5 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ. 60 వేల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించారు.