VIDEO: ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఎంపీ ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. కానీ.. రహ్మత్ నగర్ డివిజన్‌లోని BJR నగర్‌లో రాత్రి 9:30 గంటలకు కూడా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రచారం చేశారు. ప్రజా ప్రతినిధులే ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారని పలు పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం SMలో వైరల్‌గా మారింది.