అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

BDK: దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీకి చెందిన లబ్ధిదారులకు గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్వతనేని వరప్రసాద్ ఇందిరమ్మ ఇళ్ల అర్హత పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దశలవారీగా అందరికీ ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు.