'రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి'
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రం మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు ప్రక్రియ, రైతుల సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వేగంగా ధాన్యం కొనుగోలు చేసి, చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు.