కెనడాలో యూట్యూబర్‌ దారుణ హత్య

కెనడాలో యూట్యూబర్‌ దారుణ హత్య

కెనడాలో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. అంటారియో ప్రావిన్సుకు చెందిన 45 ఏళ్ల మహిళపై దుండగులు కత్తులతో దాడి చేశారు. గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె ప్రాణాలు కోల్పోయారు. మృతురాలిని లాసల్లేలోని టాడ్‌ లేన్‌కు చెందిన నాన్సి గ్రేవాల్‌గా గుర్తించామని స్థానిక పోలీసులు వెల్లడించారు. పంజాబ్‌ మూలాలున్న నాన్సీ.. యూట్యూబ్‌లో క్రియాశీలంగా ఉన్నట్లు సమాచారం.