ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి
GNTR: పొన్నూరులో ఇవాళ MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెదకాకాని CPM పార్టీ నేతలు ఇళ్ల స్థలాల కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీ, పలు కాలనీలలో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలం లేని వారికి స్థలాలు కేటాయించాలని వారు కోరారు.