నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NGKL: పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ ఏఈ మాన్య నాయక్ తెలిపారు. మరమ్మత్తులు కారణంగా నాగనూల్ ఫీడర్ పరిధిలోని బస్ డిపో, శ్రీపురం చౌరస్తా, ఆంజనేయ స్వామి దేవాలయం తదితర ప్రాంతాల్లో మ.2 గంటల నుంచి సా.6 గంటల వరకు విద్యుత్ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.