థాయిలాండ్ వేదికగా బాపట్ల పోలీసుల ఘన విజయం
BPT: థాయిలాండ్‌లో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2026లో జిల్లా పోలీసులు భారత జెండాను ఎగురవేశారు. చీరాల వన్‌టౌన్ సీఐ సుబ్బారావు 200 మీటర్ల స్ప్రింట్‌లో అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించారు. ఆయన విజయంపై సహచర పోలీసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.