అలంపూర్‌లో అన్నదాన సత్రం మార్పు

GWDL: అలంపూర్‌లోని 5వ శక్తి పీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన సత్రం కొత్త భవనంలోకి మారుతున్నట్లు దేవస్థానం ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ మార్పిడికి సంబంధించిన ప్రత్యేక పూజా ప్రారంభంకానుంది. మహాగణపతి పూజ, పుణ్యావచనం, సంప్రోక్షణ, నవగ్రహ పూజ, రుద్ర హోమం వంటివి నిర్వహిస్తారు.