మాతా శిశు మరణాల నివారణే లక్ష్యం: కలెక్టర్
SS: జన్మనిస్తూ ఏ తల్లి, శిశువు మరణించకూడదని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలపై అవగాహన కల్పించాలని సూచించారు. 15 ఏళ్లలోపు బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని స్పష్టం చేశారు.