కల్తీ బాదంపాలు.. అసలు కారణమిదే..!!

కల్తీ బాదంపాలు.. అసలు కారణమిదే..!!

శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం జాతరలో బాదంపాలు తాగి 125 మందికి పైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆహార భద్రత అధికారులు పంపిన బాదంపాల నమూనాల పరీక్షల్లో మైక్రోబయల్ కంటామినేషన్, ప్రమాదకరమైన 'ఈ-కోలి' బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. మానవ లేదా జంతు మల వ్యర్థాలు కలిసిన నీటిని బాదంపాలలో వాడటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.