'జాతీయ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
E.G: కక్షిదారులు సామరస్యం, సంధి చేసుకునే నైజం కలిగి లోక్ అదాలత్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పలు కేసులను పరిష్కరించారు. రాజీ కుదిరిన అనంతరం బాధితులకు మంజూరైన పరిహార చెక్కులు అందజేశారు.