సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు

సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు

AKP: నర్సీపట్నం డివిజన్ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం నిర్వహించారు. డివిజన్ పరిధిలో 12 మండలంలో పని చేస్తున్న సర్వేయర్లు 11 మందిని నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా వరుణ్ కుమార్, కోశాధికారిగా కిరణ్ మైఖేల్, ఉపాధ్యక్షుడిగా అమానుల్లా, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణలను ఎన్నుకున్నారు.