VIDEO: వరంగల్‌లో వైడ్రా ఏర్పాటు చేయాలి: MLA
WGL: హైడ్రా మాదిరిగా వరంగల్ నగరంలో వైడ్రా (WARANGAL DISASTER RESPONSE AUTHORITY) ఏర్పాటు చేస్తే నగరం సేఫ్‌గా ఉంటుందని MLA కేఆర్ నాగరాజు అన్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, నాళాలు ఖాళీ అవుతాయని, నగరం రక్షణ పొందుతుందని తెలిపారు. హైడ్రాపై కొంతమంది దుష్ప్రచారం చేశారని, జూబ్లీహిల్స్ ప్రజలు ఆ అబద్ధాలను నమ్మకుండా చెంప చెల్లుమనిపించారని MLA అన్నారు.