'తుఫాను బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి'
SRCL: మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో కలిసి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు.