VIDEO: కనిగిరి పట్టణంలో భారీగా గంజాయి స్వాధీనం

VIDEO: కనిగిరి పట్టణంలో భారీగా గంజాయి స్వాధీనం

ప్రకాశం: కనిగిరి పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టుబడ్డ నలుగురు నిందితుల నుండి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.