ఈనెల 8-14 వరకు గ్లకోమా వారోత్సవాలు
ASR: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఏటా నిర్వహించే గ్లకోమా వారోత్సవాలు ఈనెల 8-14వ తేదీ వరకు జరగనున్నాయని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు శనివారం తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి పాడేరు ప్రభుత్వ, అరకు ఆసుపత్రుల్లో నేత్ర వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక గ్లకోమా స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు.