పట్టుదల కృషికి ప్రతీక భగీరథ మహర్షి: కలెక్టరేట్

పట్టుదల కృషికి ప్రతీక భగీరథ మహర్షి: కలెక్టరేట్

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహర్షి గొప్ప తపస్విగా కొనియాడారు. ప్రయత్నం పట్టుదల, కృషికి ప్రతీక భగీరథ మహర్షి అని తెలిపారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.