'చంద్రబాబుకు ప్రజలంటే బాధ్యత లేదు'
AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. దేవుడంటే భయం లేదు.. ప్రజలంటే బాధ్యత లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామిని సైతం తన వికృత రాజకీయాల్లోకి లాగారని విమర్శించారు. 'పరకామణి కేసులో రవి కుమార్‌ని మా హాయంలోనే పట్టుకున్నాం.. దాదాపు 30 ఏళ్లుగా చోరీలు చేస్తున్నా చంద్రబాబు హయాంలో పట్టుకోలేదు' అని శివశంకర్ పేర్కొన్నారు.