రోళ్లవాగు ప్రాజెక్ట్​కు అనుమతులు వేగవంతం చేయండి: ఎంపీ

రోళ్లవాగు ప్రాజెక్ట్​కు అనుమతులు వేగవంతం చేయండి: ఎంపీ

NZB: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో గల రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల విషయంలో వేగవంతం చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి​ కోరారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. అనుమతుల విషయంలో చొరవ తీసుకోవాలని ఎంపీ అర్వింద్​ను ఇటీవల జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్ కుమార్ కోరారు.