'రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలి'

KMM: నగరంలోని మధ్య గేట్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని త్రీ టౌన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. వినతి అందించిన వారిలో కాళ్ల పాపారావు, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్నికృష్ణారావుతో పాటు సన్నె ఉదయ ప్రతాప్ ఉన్నారు.