'ప్రజావ్యతిరేక చర్యలపై పోరాటం ముమ్మరం చేస్తాం'

బాపట్ల: పట్టణంలో ఆదివారం నిర్వహించిన CPM సమావేశంలో డి. రమాదేవి మాట్లాడారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసి బడా కంపెనీలకే ప్రయోజనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వచ్చే నెల 5న ధర్నా విజయవంతం చేయాలని తెలిపారు. ప్రజావ్యతిరేక చర్యలపై పోరాటం ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.