'కాంగ్రెస్ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తుంది'
జగిత్యాలలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముకేశ్ కన్నా ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గాజంగి నందయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తుందని, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందన్నారు.