అచ్చంపేటలో యూరియా కోసం రైతుల బారులు

అచ్చంపేటలో యూరియా కోసం రైతుల బారులు

NGKL: అచ్చంపేటలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు భారీగా గుమిగూడటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. ఒక పాస్ బుక్‌కు కేవలం ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన పంపిణీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.