పూడిక తీయించిన కార్పొరేటర్

SRD: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పటాన్‌చెరువు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాలనీలోని గాడిదలకుంట చెరువు నిండి చేరువలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు వెళ్లడంతో స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శనివారం ఉదయం ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించారు. వెంటనే GHMC సిబ్బందితో పూడికతీత పనులు చేయించారు.