ముడా ఛైర్మన్ ప్రసాద్ రాజీనామా

కృష్ణా: మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ మట్టా ప్రసాద్ (బీజేపీ) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర పదవికి అధిష్టానం నియమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రసాద్ తెలిపారు. బీజేపీలో ఒకరికి ఒకే పదవి అనే నిబంధన ప్రకారం, రాష్ట్ర పదవిని చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం మూడా ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు.