పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్ఐ
SKLM: ఆముదాలవలస జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి వాతావరణం కనిపించింది. ఈ కేంద్రంలో సుమారు 140 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు ఎంఈఓ కె.ఏ. రాములు తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్ఐ బాలరాజు తెలిపారు.