'మంగళగిరి ఎయిమ్స్‌లో 30 లక్షల ఓపీ సేవలు పూర్తి'

'మంగళగిరి ఎయిమ్స్‌లో 30 లక్షల ఓపీ సేవలు పూర్తి'

GNTR: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి మరో మైలు రాయిని సొంతం చేసుకుంది. ఆసుపత్రి ప్రారంభం నుంచి ఇప్పటివరకు 30 లక్షల మందికి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు అందించినట్లు బుధవారం అధికారులు ప్రకటించారు. గత ఆరు నెలల్లోనే 5 లక్షల ఓపీలు నమోదయ్యాయి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత మెరుగైన సేవలు అందిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.