మామిడి పంటను ధ్వంసం చేసిన దుండగులు
CTR: పెద్దపంజాణి (M) శంకర్రాయలపేటలో గుర్తు తెలియని వ్యక్తులు మామిడి పంటను ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన రైతు మాడి శంకరప్ప రెండు ఎకరాల్లో మామిడి చెట్లు నాటాడు. మంచి కాయలు కాయడంతో కవర్లు సైతం కట్టించాడు. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు తోటలోని కాయలను ధ్వంసం చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.