VIDEO: 'మురుగు నీటితో ఇబ్బంది పడుతున్న స్థానికులు '

WGL: నర్సంపేట పట్టణంలోని పలు వీధుల్లో మురుగు నీరు రోడ్లపైకి రావడంతో బుధవారం స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి వర్షాలతో డ్రైనేజ్‌లు పేరుకుపోయాయి. గాంధీ విగ్రహం వద్ద మురుగు నీరు రోడ్డుపైకి వస్తోంది. కొన్ని రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించాలని కోరారు.