రేపల్లెలో ఉపాధ్యాయ సంఘాలు నిరాహారదీక్ష

రేపల్లెలో ఉపాధ్యాయ సంఘాలు నిరాహారదీక్ష

BPT: రేపల్లెలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు నిరాహారదీక్ష చేపట్టాయి. రిటైర్డ్ ఉపాధ్యాయులు, యూటీఎఫ్ సీనియర్ నాయకులు గాదే సుబ్రహ్మణ్యేశ్వరరావు, కొల్లూరు శరతబాబు, బసవేశ్వరరావు, సీఐటీయూ జిల్లా కోశాధికారి సీహెచ్. మణిలాల్ ఈ నిరాహారదీక్షను ప్రారంభించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని కోరారు.