'ఇంటి పన్నులను సకాలంలో చెల్లించాలి'
AKP: ఇంటి పన్నులను సకాలంలో చెల్లించాలని ఎస్. రాయవరం మండలం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ విజ్ఞప్తి చేసారు. మంగళవారం దార్లపూడి, భీమవరం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఇంటి పనులను వసూలు చేసి రసీదులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పన్నులు బకాయిలు లేకుండా చెల్లించాలన్నారు. ప్రజలు కట్టే ఇంటి పనులతో పంచాయతీలలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.