రేపు జిల్లావ్యాప్తంగా పంచాయతీల్లో ఉపాధి గ్రామసభలు
NLR: జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో ఉపాధి గ్రామ సభలు నిర్వహించాలని డ్వామా పీడీ గంగాభవాని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ఈ గ్రామ సభల్లో కొత్త జాబ్ కార్డులు స్వీకరణ, ఈకేవైసీ ప్రక్రియ, కొత్త పనుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఈ కేవైసీ ద్వారా రద్దయిన జాబ్ కార్డులు పరిశీలన, అర్హులు ఎవరైనా ఉంటే ఆ జాబ్ కార్డులు పునరుద్ధరించాలని అవకాశం కల్పించనున్నారు.