VIDEO: ‘బడి బాట’ కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు

VIDEO: ‘బడి బాట’ కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు

NZB: బోధన్ లోని కల్దుర్కి ZPHS పాఠశాల ఆధ్వర్యంలో ‘బడి బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో లభించే ఉచిత విద్యా వసతులు,మధ్యాహ్న భోజనం, నాణ్యమైన బోధన గురించి వివరిస్తూ, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.