నిర్మించిన రెండు నెలలకే కుంగిన కల్వర్టు!

నిర్మించిన రెండు నెలలకే కుంగిన కల్వర్టు!

SRD: పటాన్చెరు- హైదరాబాద్ వెళ్లే రహదారిపై చేపట్టిన రోడ్డు విస్తర్ణ పనుల్లో నాణ్యతా లోపం బయటపడింది. కాకతీయనగర్ కాలనీ వద్ద నిర్మించిన కల్వర్టు కుంగిపోయింది. నాసిరకం మెటీరియల్ వాడటంతో రెండు నెలల్లోనే దెబ్బతిన్నదని స్థానికులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.