VIDEO: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. చలికి గజగజ

VIDEO: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. చలికి గజగజ

KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గత వారం నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు 10°C నుంచి 12°Cకి పడిపోవడంతో ప్రజలు రాత్రి 6 గంటలకే ఇళ్లకు పరిమితమవుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.