కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

KMR: కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి, మహిళా సమైక్య సభ్యులు, రైతులు పాల్గొన్నారు.