మురికికుంటగా మారిన కోనేరు

మురికికుంటగా మారిన కోనేరు

NLR: కందుకూరు (M) కొండికందుకూరులో ఒకప్పుడు ప్రధాన నీటి వనరుగా ఉన్న కోనేరు ఇప్పుడు మురికికుంటగా మారడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని శుభ్రపరచకపోవడంతో దోమల పెరుగి అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని వాపోతున్నారు. పక్కనే సచివాలయం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.