'అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి'
VSP: భారతీయ జనతా పార్టీ 46సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆర్కేబీచ్ వద్ద జరిగింది. విశాఖలో ప్రతి వార్డులోనూ బీజేపీ జెండా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు.