టీడీపీ మండల అధ్యక్షుడిగా మహబూబ్ సాహెబ్
ప్రకాశం: పెద్ద దోర్నాల మండల నూతన టీడీపీ అధ్యక్షుడిగా ఇవాళ షేక్ మహబూబ్ సాహెబ్ నియమితులయ్యారు. కళావేదిక AP కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ.. విద్యావేత్తగా విద్య విలువలను సమాజానికి చాటి చెప్పే వ్యక్తిత్వం ఆయనదని, మంచి నాయకుడిగా ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.