నేడు త్రాగునీటి సరఫరాకు అంతరాయం
SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీలో పంప్ హౌస్ నుంచి ట్యాంకులకు మంచినీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ అచ్యుతాపురం వద్ద మరమ్మతులకు గురైంది. దీంతో నీరు వృథాగా పోతోంది. పంచాయతీ అధికారులు మరమ్మతులు చేపడుతుండటంతో శనివారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్ప డుతుందని పంచాయతీ కార్యదర్శి వి. రామచంద్ర రావు పేర్కొన్నారు.