2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం: సీఎం
ELR: ఉంగటూరు మండలంలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను చేసి చూపించామన్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు.